నిజమే అన్నపూర్ణ గారు పేరు తగ్గట్టే అన్నపూర్ణ… భార్యగా అక్కినేనికి అదృష్టం… ఆయన ఎప్పుడు ఆవిడ గురించి మాట్లాడినా ఆయనకు ఆవిడపట్ల గల ప్రేమ వ్యక్తమయ్యేది.. ఆవిడ వెళ్ళిపోయాక ఇంట్లోనూ, స్టూడియోలోను అన్నపూర్ణ గారి విగ్రహాలు చేయించి పెట్టారు నాగేశ్వరరావు గారు… అచ్చం అన్నపూర్ణ గారినే చూస్తున్నట్టు వుంటుంది… నాగేశ్వరరావు గారు రెగ్యులర్ గా కూర్చొనే చోటికి దగ్గరలోనే ఆ విగ్రహాలు పెట్టించారు… ఇక నాకు తెలిసిన అన్నపూర్ణ గారు.. వెంకటేశ్వర రావు అనే ఉద్యోగి ఒకరు అక్కినేని గారింట్లోనే వుండేవారు.. ప్రతిరోజూ నాగేశ్వరరావు గారు జంటనగరాల్లో ఏదోఒక సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యేవారు కదా..ఆ విశేషాలన్నీ ఆ మర్నాడు పేపర్లలో వచ్చేవి… అన్నపూర్ణ గారు వెంకటేశ్వరరావు గారి తో ఆ విశేషాలు చదివించుకునేవారు..అతను చదివేటప్పుడు ఎక్కడన్నా సందేహం వస్తే ఆవిడ ప్రత్యేకంగా అడిగేవారు”ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు కదా… వాళ్ళు రాయలేదేమిటి”అని…అంత సునిశితంగా ఆయన ప్రతిమాటను,ప్రతి కదలికను గమనించే వారు..ఆయనకు సంబంధించిన ప్రతి విషయం perfect గా వుండాలని కోరుకునే వ్యక్తి… ఆయన కెరియర్ లో అద్భుతమైన సలహాలిచ్చి ఆయన విజయానికి తోడ్పడిన ముఖ్యమైన వ్యక్తి… జీవితభాగస్వామిని అనే మాటకు నిర్వచనం ఆమె. ఆయన ఆశయాలకు ఆదర్శాలకు బాసటగా నిలచి “అర్ధాంగి”అన్నమాటను సార్ధకం చేసిన సంపూర్ణ మహిళ అన్నపూర్ణమ్మ గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారిని నేను ఇంటర్వ్యూ చేసాను..ఆ ఇంటర్వ్యూ ప్రసారమౌతున్న సందర్భంలోనే ఆయన పుట్టినరోజు వచ్చింది…వెళ్ళాను.. ఆమె వీల్ చైర్ లో వున్నారు. ఆవిడ నన్ను చూడగానే ఎంతో అభిమానంగా ఇలాగే ఇలాగే అన్నారు… “విజయదుర్గ గారుమా ఆయన ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు..మధ్యమధ్యలో మంచి ఫోటోలు వేసారు..మా బంధువులందరికీ బాగా నచ్చింది…వచ్చిన వాళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు”అంటూ నా చేయి పట్టుకొని”వుండండి”అని.. అక్కడ ఎవరో వుంటే”ఓరే విజయదుర్గ గారికి బొబ్బట్లు టిఫిన్ పట్రా”అని పురమాయించారు… అంత ప్రేమ ఆ దంపతులిద్దరికి నేనంటే…ఇద్దరిలోనూ అంత Simplicity…అసలు ఇద్దరూ ఎంత నిరాడంబరంగా వుంటారో Unimaginable… నాగేశ్వరరావు గారు నేనూ తరచుగా ఫోన్లో కూడా మాట్లాడుకునే వాళ్ళం.. రాస్తూ వుంటే నాకు కన్నీళ్ళు ఆగటంలేదు… అలా ఒకరోజు ఫోన్ లో మాట్లాడుతూ వుంటే ఎందుకో ఆడవాళ్ళ ప్రస్థావన వచ్చింది… “ఆడది లేకపోతే మగాడి జీవితం ఏముంది దుర్గా!! శూన్యం..”అంటూ నాగేశ్వరరావు గారు ఆరోజు చాలా ఎమోషనల్ అయ్యారు..ఆయన హృదయంలో ఆమె స్థానానికి ఎంతో అబ్బురపడ్డాను.సినిమానే వృత్తిగా,ఎందరో హీరోయిన్లతో అత్యంత సన్నిహితంగా నటించి”రొమాంటిక్ హీరోగా”ముద్రపడ్డ నాగేశ్వరరావు గారి మాటలు విన్నాక అర్ధమయింది ఒక్కటే..వృత్తి వేరు-వ్యక్తిత్వం వేరు అని… హీరోగా ఆయన ఎందరికో ఆదర్శం,ఎందరికో ప్రేరణ.. సినిమాల్లో ఆయన వేషధారణ అంటే ఆయనలాగే డ్రెస్సెస్ ను ఇమిటేట్ చేసిన యూత్ ఎందరో…ఆయన లాగా స్టైల్ గా స్మోక్ చేసేవాళ్ళెందరో…ఆయన డాక్టర్ వేషం చూసి డాక్టర్లు అయినవాళ్ళు కొందరైతే,కలకానిది విలువైనది పాట విని ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నవారు ఒకరు…ఇలా ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా వుంది..ఇండస్ట్రీ అంటే అవలక్షణాలకు నిలయమని ఎప్పట్నుంచో ఓ పేరుంది. అలాంటి చోటు నుంచి వచ్చిన అక్కినేని ఏనాడూ దేనికి బానిస కాలేదు. అన్నింటికీ దూరంగా ఉన్నారు. మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు ఏనాడూ చేరువ కాలేదు అక్కి నేని. విలాసాలు, విందులకు కూడా అక్కినేని వీలైనంత దూరంగా ఉండేవారు. ఇక 75 ఏళ్ల సినీ జీవితంలో ఏనాడూ అక్కినేనిపై ఎలాంటి పుకార్లు రాలేదు. ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో ఒక క్రమశిక్షణతో వున్న ఏకైక వ్యక్తి అక్కినేని మాత్రమే అని ఘంటాపథంగా చెప్పొచ్చు…ఏమైనా అక్కినేని అన్నపూర్ణ గార్ల దాంపత్య జీవితం ఆదర్శం…ఒకరికోసం ఒకరు…ఆయన జీవితం తెరిచిన పుస్తకం..ఆయన నటనేకాదు, దాంపత్య జీవితం కూడా ఆదర్శమే..పేరు ఈశ్వరుడిదే అయినా”ఒకే బాణము-ఒకటే మాటఒక్క భామకే రాముని ప్రేమ” ఆయన ఎన్నో సందర్భాల్లో నాతో మాట్లాడిన మాటలే ఇంటర్వ్యూ గా సమీరా గారికి ఇచ్చారు… అది మీరు కూడా చదువుతారని… మీకోసం…
ತೆಲಂಗಾಣ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆ – ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಲೇಔಟ್ ಶಾಸಕ ಗೋಪಾಲಯ್ಯ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಭೇಟಿ
ಮುಂಬರುವ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಗೆ ಅಣಿ ಗೊಳಿಸಲು ಕೇಂದ್ರ ಬಿಜೆಪಿ ಹೈಕಮಾಂಡ್ ಸೂಚನೆ ಮೇರೆಗೆ ಮಾಜಿ ಸಚಿವರು ಹಾಗೂ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಲೇಔಟ್ ವಿಧಾನ ಸಭಾ ಕ್ಷೇತ್ರದ...