
నేను నిజంగా చాలా చాలా అదృష్టవంతురాల్ని.వెండితెరను అవిచ్ఛిన్నంగా ఏలిన మహానుభావులను,నిజమైన లెజెండ్స్ ని ఇంటర్వ్యూలు చేయడం భగవంతుడు నాకు ప్రసాదించిన వరం ఈ వుద్యోగం… నటుడుగా రామలింగయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వ్యక్తిగా నిజంగా ఆయన మహానుభావుడే..మహామనీషి కూడా..అలాంటి గొప్ప వ్యక్తిత్వం వున్న కళాకారులు చాలా అరుదు.. చెత్తకుప్పల మధ్య బ్రతికేవారికి వజ్రవైఢూర్యాలు దొరికినట్లే.. సరే ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా 2,3 సార్లు కలిశాను.అప్పటికి సెల్ ఫోన్లు లేవు.. సరే వారింటికి వెళ్ళాం.. *విజయదుర్గ గారు మనం షూటింగ్ చిరంజీవి ఇంట్లో పెట్టుకుందాం..మీ వాళ్ళు ఆఫీసు కారులో వస్తారు.మనం మన కారులో వెళ్దాం* అన్నారు..సరే కారులో దారిపొడవునా ఆయన కబుర్లు చెప్తూనే ఉన్నారు..నేను పాయింట్స్ వెతుక్కుంటున్నాను నా ఇంటర్వ్యూ కి.. సరే వెళ్ళగానే వాళ్ళ కుర్రాడ్ని పిలిచి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.కాఫీలుతాగాం10 గం.లకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాం..ఎన్ని కబుర్లు చెప్పారో.సాయంత్రం 5.30 వరకు మా సంభాషణ కొనసాగింది.. మధ్యాహ్నం *నో లంచ్* ఆయన పెద్దవయసువారు.నేను ఎంత బ్రతిమిలాడినా భోజనం చేయలేదు.భోజనం చేస్తే నేను పని చేయలేను అన్నారు.ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన కూడా వుంది.మాకు మళ్ళా సా.4.30కి ఉప్మా చేయించారు..ఆయన అలాగే మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చొన్నారు… చాలా విశేషాలున్నాయి కానీ ఇప్పుడు కాదు.. ఆయన హోమియోపతితో అద్భుతాలు చేసిన డాక్టరే కాదు.తననటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకొన్న *మహానటుడు*..ఇక ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వంతో నా హృదయాన్ని కొల్లగొట్టిన *మహామనీషి* ఒక చిన్న సంఘటన చెప్తాను.. *ఇవాళ వుదయం ఒక ప్రొడ్యూసర్ ని కలవాల్సి వుంది.ఒక సినిమా విషయంగా రమ్మన్నాడు దారిలోనే*అని ఆగిపోయారు. *అయ్యో!!!ఐతే మీరు వెళ్ళాల్సింది.నేను వెయిట్ చేసేదాన్ని కదా* అన్నాను నొచ్చుకుంటూ.. ఆయన అక్షరాల ఇలాగే అన్నారు..*మిమ్మల్ని ఏదో పిచ్చి కామెంట్ చేస్తారు..వాళ్ళ నోళ్ళు మంచివి కావు* అన్నారు.ఆ మాటలకు నేను నిశ్చేష్టురాల్నయ్యాను. ఆయన ఎంతదూరం ఆలోచించారు.ఒక ఆడపిల్ల గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో ఆయన తన సినిమా అవకాశాన్ని పట్టించుకోలేదు..ఇంకా చాలా వుంది.కానీ ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి హృదయాంజలి ఘటిస్తూ..ఈ రోజు ఆయన పుట్టిన రోజు.హాస్యానికి పండుగరోజు.ఈ కార్యక్రమం నా నివాళిగా సమర్పిస్తూ..
.బాలు గారికి కూడా స్మ్రత్యంజలి