కడపజిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా
కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాట్ పట్టి ,చేతికి గ్లౌస్ తొడిగి క్రికెట్ ఆడారు….స్థానికంగా ఉన్న రంజీ ప్లేయర్స్‌ను బౌలింగ్ వేయమని కొరిమరి బాటింగ్ ఆడారు….అనంతరం తాను ఆడిన బ్యాట్ పై తన సంతకాన్ని పెట్టి బహూకరించాడు…ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తి నింపారు…
ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కి స్వాగతం పలుకుతూ మైదానంలో పచ్చిక లో అందంగా ఆహ్వానం పలుకుతూ రూపొందింఛారు.. 14 ఏళ్ళ క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల తో 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆంద్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో స్టేడియం నిర్మాణం 2010 లో పూర్తయ్యింది.. ఇప్పటికే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ తో పాటు రంజీ క్రికెట్ మ్యాచులు నిర్వహిస్తున్నారు.. భవిష్యత్తులో డే నైట్ మ్యాచుల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది.. రూ. 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు…