ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే…:
చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలి
సరసమైన ధరలకే మత్స్య ఉత్పత్తులు ప్రజలకు చేరాలి
ఈ లక్ష్యాలను చేరుకునేందుకే ఆక్వాహబ్‌ల ఏర్పాటు
స్థానిక మార్కెట్‌ను విస్తరించడం వల్ల ఇటు రైతులకూ మేలు జరుగుతుంది:
మంచి ధరలు వారికి అందుతాయి:
ఇటు రైతులకు, అటు వినియోగదారులకు మేలు చేయడానికే ఆక్వాహబ్‌లు తీసుకు వచ్చాం:
ఆక్వాహబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్ దుకాణాల వివరాలను అందించిన అధికారులు
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానికంగా ఉన్న వినియోగం 4.36లక్షల మెట్రిక్ టన్నులు, దీన్ని ఏడాదికి 12 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలన్నది లక్ష్యమన్న అధికారులు
ఆక్వా యూనివర్సీటీ
ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం
యూనివర్సిటీ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి
భూసేకరణపనులుపై మరింత ధ్యాస పెట్టాలి
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా రంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం ఆదేశం
ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్
ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ మీద బాగా ప్రచారం చేయాలి
వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి
సీడ్, ఫీడ్ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా ఉండాలి
ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అందరికీ సమాచారం తెలియాలి
35 ల్యాబ్స్‌లో ఇప్పటికే 14 ప్రారంభం కాగా, మరో 21 ల్యాబ్స్ నవంబర్‌లో ప్రారంభం
ఈ ఆక్వాకల్చర్ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలి
ఫిషింగ్ హార్భర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల పనులు ప్రగతిపైనా సీఎం సమీక్ష
రాష్ట్రంలో 7 ఫిషింగ్ హార్భర్లు, 5 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో పనుల ప్రగతిపై సమీక్షించిన సీఎం
5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిష్ ల్యాండ్ సెంటర్‌లో పనుల ప్రారంభమయ్యాయన్న అధికారులు
మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
కేజ్ ఫిష్ కల్చర్
కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి
వీటితో ఆదాయాలు బాగా పెరుగుతాయి
కేజ్ ఫిష్ కల్చర్‌కు సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయండి, అధికారులకు సీఎం ఆదేశం
దీనిపై రైతులు, ఔత్సాహికులను కలిపి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించండి
ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పేదవాడు లాభపడేవిధంగా ఉండాలి
పైలెట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్ మూడు చోట్ల మరీకల్చర్‌ను మొదలుపెట్టాలని ఆదేశం
అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా విస్తరించాలన్న సీఎం
వెటర్నరీ డిస్పెన్సరీలు
పశుసంవర్ధకశాఖపైనా సీఎం సమీక్ష
వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలి
ప్రతి గ్రామంలో ఏముండాలి ? మండల కేంద్రంలో ఏముండాలి ? అన్నది నిర్ధారించాలి
గ్రామం, మండలం, నియోజకవర్గ స్ధాయిలో ఏయే డిస్పెన్షరీలు ఉండాలన్నదానిపై హేతుబద్ధత ఉండాలి
దానిపై కార్యాచరణ రూపొందించాలి
తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలి
మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కావాల్సిన డిస్పెన్షరీలను ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయి
వీటన్నింటిపై పటిష్టంగా మ్యాపింగ్ చేయాలి
ప్రజావైద్యానికి సంబంధించి మనం ఒక ప్రోటోకాల్ అనుసరిస్తున్నాం
మండలానికి రెండు పీహెచ్‌సీలు, నలుగురు వైద్యులు, రెండు అంబులెన్స్‌లు పెట్టాలన్న విధానంతో ప్రజారోగ్యరంగంలో ముందుకు పోతున్నాం
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రకారం ముందడుగులు వేస్తున్నాం
ఇలాంటి హేతుబద్ధత, పటిష్టమైన వ్యవస్ధ పశుసంవర్ధకశాఖలో కూడా ఉండాలి
ఆర్బీకేల కియోస్కుల్లో పశుదాణా తదితర ఉత్పత్తులన్నింటినీ అందుబాటులో ఉంచాలి
కస్టమ్ హైరింగ్ సెంటర్లకు మంచి స్పందన వస్తుందన్న అధికారులు
వాటి ద్వారా రైతులతో నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలి
అధికారులకు సీఎం ఆదేశం
పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుకు కార్యాచరణ
రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలి
నాడు–నేడులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందుగా నిర్ధారించుకోవాలి
ఏయే రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలి
తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి
అధికారులకు స్పష్టం చేసిన సీఎం
ఏపీ అమూల్ పాలవెల్లువ
ఏపీ అమూల్ ప్రాజెక్టు అమలుకు సంబంధించి సీఎంకు వివరాలు అందించిన అధికారులు
ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలవెల్లువ ప్రారంభం
ఆగష్టు నెలలో ఏపీ అమూల్‌ను విశాఖపట్నం, అనంతపురము జిల్లాలకు విస్తరిస్తున్నట్లు తెలిపిన అధికారులు
ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ లిమిటెడ్ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.