నవ సాహితి ఇంటర్నేషనల్ సంస్థ వారు ఎంపిక చేసిన ఉత్తమ విమర్శ వ్యాసానికి మాడభూషి కళా పరిషత్ ద్వారా అఫ్సర్ కవిత్వం గురించి రాసిన విమర్శనా వ్యాసానికి ఈ పురస్కారం దక్కగా,రచయిత, బెంగులూరు వాసి, డా. శ్రీనివాస్ వాసుదేవ్ కి, ఆంధ్రజ్యోతి సంపాదకులు డా. శ్రీనివాస్ అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ , అఫ్సర్ కథానాయకుడిగా కవిత్వ పరిశీలన చేసి డా. శ్రీనివాస్ వాసుదేవ్ వ్రాసిన ఈ విమర్శ వ్యాసం ఆధునిక కవిత్వంలో ఒక నమూనా లాంటిదని, అఫ్సర్ అమూర్త భావనలను మెటఫర్ల వాడకం, గురించి నిశితంగా పరిశీలించి రాశారన్నారు.
నవ సాహితి ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ ఇండియా టుడే ఎడిటర్, సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో ‘ఉత్తమ విమర్శ వ్యాసం పురస్కారాన్ని’ మాడబూషి కళా పరిషత్ తరపున అందజేసే కార్యక్రమానికి ప్రొ డా మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు. సూర్య ప్రకాష్ రావు మాట్లాడుతూ అఫ్సర్ దంపతులు జర్నలిస్టులగా జీవితాన్ని ప్రారంభించి వచన కవిత్వాన్ని కొత్తగా నిర్వచించారని తెలియచేసారు. ఉత్తమ కవితలకు కథలకు విమర్శలకు పురస్కారాలు అందజేస్తున్నామని అక్టోబరు మాసం నుండి సాహితీ జర్నల్ ను ప్రారంభిస్తామని తెలియజేశారు.
అమెరికా నుంచి ముఖ్య అథితిగా హాజరైన కవి అఫ్సర్ సర్ మాట్లాడుతూ ఉత్తమ విమర్శనా వ్యాసం తన కవిత్వం మీద రాసినందుకు అభినందిస్తూ సాహిత్య విమర్శ వ్యాసం మీద ఉత్తమ అవార్డును ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అఫ్సర్ గారి సతీమణి ముఖ అథితి కల్పన డా. వాసుదేవన్ శ్రీనివాస్ ను అభినందిస్తూ సిద్దాంత గ్రంథము రాసేంత పరిజ్ఞానము కలిగి ఉన్నారని అభినందించారు.
అవార్డు గ్రహీత డా. వాసుదేవ్ శ్రీనివాస్ మాట్లాడుతూ,అఫ్సర్ కవిత్వం 1990లో మొదటి సారిగా చదివానని 600 కవితలను 6 పేజీలలో రాయడం కత్తి మీద సాము లాంటిదని దానిని ఒక పాఠకునిగా రాసాననీ అన్నారు.
సుధామురళి, స్వాతి కృష్ణ సన్నిధి , జ్యోతి మువ్వల సంయుక్తంగా నిర్వహించిన ఈ సభలో సీనియర్ జర్నలిస్ట్ బిక్కి కృష్ణ, కవి, రచయిత కె. కళ్యాణ్ కృష్ణ కుమార్, కవి సి వి సురేష్, వ్యక్త కవి అరణ్య కృష్ణ, వక్త కవయిత్రి వేదాంతం విష్ణు ప్రియ , వక్త కవయిత్రి లక్ష్మి రాధిక, ప్రసంగించారు. అనంతరం అఫ్సర్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. బి జ్యోతి , ఫణి మాధవి, లక్ష్మీ ప్రశాంతి , కె. శ్రీ లత, శివ నాయుడు, నవీన్ హోతా మరియు సుధా మురళి ల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.